![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -259 లో..... సాగర్ కి నర్మద అల్ ది బెస్ట్ చెప్పి ..ఎగ్జామ్ హల్ కి పంపిస్తుంది సాగర్ లోపలికి వెళ్తాడు. క్వశ్చన్ పేపర్ చూసి టెన్షన్ పడతాడు. బయట కిటికీ నుండి నర్మద చూస్తుంటుంది. బాగా రాయి అని చెప్తుంది. ఇక నీదే భారం దేవుడా అని సాగర్ దేవుడికి మొక్కుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాడు.
ఎగ్జామ్ అయిపోయాక సాగర్ బయటకు వస్తాడు. ఎలా రాసావని నర్మద అడుగుతుంది. బాగానే రాసానని సాగర్ చెప్తాడు. అదంతా శ్రీవల్లి చూస్తుంది. మీరు గుట్టుగా చేస్తుంది ఇదా అని అనుకుంటుంది. అప్పుడే కళ్యాణ్ ని ప్రేమ కొట్టడానికి కర్ర పట్టుకొని పరుగెడుతుంది. శ్రీవల్లికి కళ్యాణ్ డాష్ ఇస్తాడు. కళ్యాణ్ ని శ్రీవల్లి తిడుతుంది. తన వెనకాలే ప్రేమ పరిగెత్తడం చూసి.. ప్రేమ ఏంటి వాడి వెంట పరుగెడుతుంది. అదేంటో కనుక్కోవాలని అనుకుంటుంది. సాగర్, నర్మద బయటకు వెళ్తారు. నేను ఎగ్జామ్ బాగా రాయలేదని సాగర్ డిస్సపాయింట్ అవుతాడు. ఏం పర్లేదు నెక్స్ట్ టైమ్ బాగా రాయొచ్చని నర్మద చెప్తుంది.
మరొకవైపు కళ్యాణ్ వెంట ప్రేమ పరుగెత్తడం ధీరజ్ ఫ్రెండ్ చూసి తనకి కాల్ చేసి చెప్తాడు. కాసేపటికి ప్రేమ దగ్గరికి ధీరజ్ వస్తాడు. ప్రేమకి అప్పుడే చేతికి దెబ్బ తగులుతుంది. హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. ఏమైంది ప్రేమ చెప్పమని ధీరజ్ ఏంత రిక్వెస్ట్ చేసినా ప్రేమ సైలెంట్ గా ఉంటుంది. తరువాయి భాగంలో రామరాజు, వేదవతి ఇద్దరు తమ కూతురు అమూల్యతో బయట కూర్చొని సరదాగా మాట్లాడకుంటుంటే.. భద్రవతి చూస్తుంది. ఒరేయ్ విశ్వ మనం పడే బాధ.. వాడు కూడా పడాలంటే రామరాజు చిన్నకూతురిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని ఈ ఇంట్లో పెట్టుకోవాలి.. అప్పుడు తెలుస్తుందని విశ్వతో భద్రవతి అనగానే విశ్వ సరే అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |